Published on Dec 3, 2024
Government Jobs
బెల్‌లో టెక్నీషియన్‌ పోస్టులు
బెల్‌లో టెక్నీషియన్‌ పోస్టులు

రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్‌) శాశ్వత ప్రాతిపదికన కింది  పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 84

వివరాలు:

ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ (ట్రైనీ): 47

టెక్నీషియన్‌ ‘సీ’: 37

అర్హత: పోస్టును అనుసరించి ఎస్‌ఎస్‌ఎల్‌సీ, ఐటీఐ, ఇంజినీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు అప్రెంటిషిప్‌ సర్టిఫికేట్‌ కోర్స్‌ చేసి ఉండాలి.

గరిష్ఠ వయో పరిమితి: 01.11.2024 నాటికి 28 సంవత్సరాలు మించకూడదు.

వేతనం: నెలకు ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ పోస్టుకు రూ.24,500- రూ.90,000. టెక్నీషియన్‌ పోస్టుకు రూ.21,500- రూ.82,000.

ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.295 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది).

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 17-12-2024.

రాత పరీక్ష నిర్వహణ: డిసెంబర్, 2024.

Website: https://bel-india.in/

Apply online: https://jobapply.in/BEL2024BNGEATTECH/

ముఖ్యాంశాలు:

ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌, టెక్నీషియన్‌ ఖాళీల భర్తీకి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ దరఖాస్తులు కోరుతోంది. 

టెన్త్‌, ఐటిఐ, డిప్లొమా ఇంజినీరింగ్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు డిసెంబర్‌ 17వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.