Published on Mar 25, 2025
Current Affairs
బిల్లీ జీన్‌ కప్‌ టెన్నిస్‌ టోర్నీ
బిల్లీ జీన్‌ కప్‌ టెన్నిస్‌ టోర్నీ

బిల్లీ జీన్‌ కప్‌ టెన్నిస్‌ టోర్నీ

బిల్లీ జీన్‌ కింగ్‌ కప్‌ ఆసియా- ఓసియానియా గ్రూపు-1 టెన్నిస్‌ టోర్నీకి భారత్‌ ఆతిథ్యమివ్వనుంది.

2025,  ఏప్రిల్‌ 8 నుంచి 12 వరకు పుణెలో జరిగే ప్రతిష్టాత్మక మహిళల టీమ్‌ టోర్నీలో ఆరు జట్లు బరిలో దిగనున్నాయి.

భారత్‌తో పాటు న్యూజిలాండ్, చైనీస్‌ తైపీ, హాంకాంగ్, థాయ్‌లాండ్‌లు టోర్నీలో పాల్గొంటాయి. రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ పద్ధతిలో టోర్నీ జరుగుతుంది.

ప్రతి పోరులో రెండు సింగిల్స్, ఒక డబుల్స్‌ మ్యాచ్‌లు ఉంటాయి.

అంకిత రైనా ఆధ్వర్యంలో ప్రార్థన తొంబారె, సహజ యమలపల్లి, భమిడిపాటి శ్రీవల్లి రష్మిక, వైదేహి చౌదరిలు భారత్‌ తరఫున బరిలో దిగనున్నారు.