భారత టెన్నిస్ క్రీడాకారిణి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక (తెలంగాణ)కు ప్రతిష్ఠాత్మక బిల్లీ జీన్ కింగ్ కప్ హార్ట్ పురస్కారం దక్కింది. 2025లో బిల్లీ జీన్ కింగ్ కప్ ఆసియా- ఓసియానియా గ్రూపు-1 టోర్నీలో ప్రదర్శనకు శ్రీవల్లికి ఈ అవార్డు లభించింది. ఈ విషయాన్ని అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) 2025, జూన్ 17న ప్రకటించింది.