Published on Jun 18, 2025
Apprenticeship
బెల్‌లో గ్రాడ్యుయేట్‌ ట్రైనీ అప్రెంటిస్‌ పోస్టులు
బెల్‌లో గ్రాడ్యుయేట్‌ ట్రైనీ అప్రెంటిస్‌ పోస్టులు

బెంగళూరులోని ప్రభుత్వ రంగ సంస్థ భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌) వివిధ విభాగాల్లో ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్స్‌ నుంచి గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌షిప్‌ ట్రైనీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. కర్ణటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, పుదుచ్చెరీ రాష్ట్రాల్లో గల అభ్యర్థులు మాత్రమే ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చు.

వివరాలు:

గ్రాడ్యయేట్‌ అప్రెంటిస్‌షిప్‌ ట్రైనీ

విభాగాలు:

ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేసన్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలీకమ్యూనికేసన్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, మెకానికల్‌ ఇంజినీరింగ్‌, మెకట్రానిక్స్‌, ఇండస్ట్రియల్‌ ప్రొడక్షన్‌ తదితరాలు.

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఇంజినీరింగ్‌/ టెక్నాలజీలో డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. 

వయోపరిమితి: ట్రైనీ ఇంజినీర్‌కు 25 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

ఎంపిక విధానం: విద్యార్హతల్లో మార్కులు, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

స్టైపెండ్: నెలకు రూ.17,500.

ఇంటర్వ్యూ తేదీలు: 04, 07.07.2025.

Website:https://bel-india.in/