Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Dec 12, 2025
Apprenticeship
బెల్‌లో గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ పోస్టులు
బెల్‌లో గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ పోస్టులు

ప్రభుత్వ రక్షణ రంగ సంస్థ, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్‌) ఘజియాబాద్‌ యూనిట్‌ వివిధ విభాగాల్లో గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

వివరాలు:

గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌: 84

విభాగాలు: మెకానికల్, కంప్యూటర్‌ సైన్స్‌, ఎలక్ట్రానిక్స్‌, సివిల్‌

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్‌ (మెకానికల్, సివిల్‌, ఎలక్ట్రానిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌)లో ఉత్తీర్ణత ఉండాలి.

వయోపరిమితి: 31-12-2025వ తేదీ నాటికి 25 ఏళ్లు ఉండాలి. ఓబీసీకి 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీకి 5 ఏళ్లు, పీడబ్ల్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

స్టైపెండ్‌: నెలకు రూ.17,500.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ఆధారంగా.

దరఖాస్తు చివరి తేదీ: 2025 డిసెంబర్‌ 25.

ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా.  

ఇంటర్వ్యూ తేదీ: 2026 జనవరి 16, 17.

వేదిక: బెల్‌, సైట్‌-4, సహిబాబాద్‌ ఇండస్ట్రియల్‌ ఏరియా, భరత్‌ నగర్‌ పోస్ట్‌, ఘజియాబాద్‌-201010.

Website:https://bel-india.in/job-notifications/