భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన నవరత్న సంస్థ 'భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్' (బెల్), నవీ ముంబయి యూనిట్‌లో గ్రాడ్యుయేట్, డిప్లొమా & ఐటీఐ అప్రెంటిస్ శిక్షణ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 72
వివరాలు:
1. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 28
2. డిప్లొమా అప్రెంటిస్: 15
3. ఐటీఐ అప్రెంటిస్: 30
అర్హతలు & స్టైపెండ్:
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: ఇంజినీరింగ్ (ECE/Mech) అభ్యర్థులకు నెలకు రూ.17,500; బి.ఎస్సీ/బి.కామ్/బి.ఏ అభ్యర్థులకు రూ.12,500 చెల్లిస్తారు.
డిప్లొమా అప్రెంటిస్: నెలకు రూ.12,500 స్టైపెండ్ లభిస్తుంది.
ఐటీఐ అప్రెంటిస్: వివిధ ట్రేడ్‌లను బట్టి రూ.10,560 నుంచి రూ.11,040 వరకు స్టైపెండ్ ఉంటుంది.
అర్హత: సంబంధిత కోర్సులను జులై 1, 2021 తర్వాత పూర్తి చేసిన వారు మాత్రమే అర్హులు.
వయోపరిమితి: ఫిబ్రవరి 1, 2026 నాటికి గ్రాడ్యుయేట్/డిప్లొమా అభ్యర్థులకు 25 ఏళ్లు, ఐటీఐ అభ్యర్థులకు 21 ఏళ్లు మించకూడదు (ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్ల సడలింపు ఉంటుంది).
ఎంపిక విధానం: నవీ ముంబయిలో నిర్వహించే రాత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు & వాక్-ఇన్ షెడ్యూల్:
ఆసక్తి గల అభ్యర్థులు నిర్ణీత దరఖాస్తు ఫారమ్‌ను నింపి namuhr@bel.co.in కు ఫిబ్రవరి 27, 2026 లోపు మెయిల్ చేయాలి.
వాక్-ఇన్ తేదీలు: గ్రాడ్యుయేట్/డిప్లొమా అభ్యర్థులకు ఫిబ్రవరి 28న, ఐటీఐ అభ్యర్థులకు మార్చి 2న మధ్యాహ్నం 2 గంటలకు నవీ ముంబయిలోని ఎం.ఐ.డి.సి ఏరియాలో ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.