బెంగళూరులోని ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) హామ్ ల్యాండ్ సెక్యూరిటీ అండ్ స్మార్ట్ సిటీ బిజినెస్ ఎస్‌బీయూ (HLS & SCB SBU) ప్రాజెక్ట్ కోసం ఉత్తర్ ప్రదేశ్‌లో పనిచేయడానికి తాత్కాలిక ప్రాతిపదికన కింది ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 78
వివరాలు:
1. సీనియర్ ఫీల్డ్ ఆపరేషన్ ఇంజినీర్: 06
2. ఫీల్డ్ ఆపరేషన్ ఇంజినీర్: 41
3. ప్రాజెక్ట్ ఇంజినీర్: 13
4. ట్రైనీ ఇంజినీర్: 18
విభాగాలు: ఐటీ సెక్యూరిటీ అండ్ అసిస్టెంట్ మేనేజర్, డీసీ సపోర్ట్, ఐటీ సపోర్ట్ స్టాఫ్, కంటెంట్ రైటర్, ఐటీ హెల్ఫ్ డెస్క్ స్టాఫ్, డిస్ట్రిక్ టెక్నికల్ సపోర్ట్.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్/బీఎస్సీ ఇంజినీరింగ్, ఎంఈ/ఎంటెక్/ఎంసీఏ/ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: సీనియర్ ఫీల్డ్ ఆపరేషన్ ఇంజినీర్ పోస్టులకు 45 ఏళ్లు; ఫీల్డ్ ఆపరేషన్ ఇంజినీర్ పోస్టులకు 40 ఏళ్లు; ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులకు 32 ఏళ్లు; ట్రైనీ ఇంజినీర్ పోస్టులకు 28 ఏళ్లు; ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
జీతం: నెలకు సీనియర్ ఫీల్డ్ ఆపరేషన్ ఇంజినీర్ పోస్టులకు రూ.80,000; ఫీల్డ్ ఆపరేషన్ ఇంజినీర్ పోస్టులకు రూ.60,000; ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులకు రూ.40,000; ట్రైనీ ఇంజినీర్ పోస్టులకు రూ.30,000.
దరఖాస్తు ఫీజు: ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులకు రూ.400+జీఎస్టీ; ట్రైనీ ఇంజినీర్ పోస్టులకు రూ.150+జీఎస్టీ; మిగతా పోస్టులకు రూ.450+జీఎస్టీ. ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 24-11-2024.
Website:https://bel-india.in/