Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Dec 3, 2025
Government Jobs
బెల్‌లో ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ ట్రెయినీ పోస్టులు
బెల్‌లో ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ ట్రెయినీ పోస్టులు

ప్రభుత్వ రక్షణ రంగ సంస్థ, నవరత్న హోదా కలిగిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్‌) వివిధ విభాగాల్లో ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ ట్రెయినీ, టెక్నీషియన్‌-సీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 14

వివరాలు:

1. ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ ట్రెయినీ(ఈఏటీ): 10

2. టెక్నీషియన్‌ సీ: 04

విభాగాలు: ఎలక్ట్రానిక్స్‌, మెకానికల్, ఎలక్ట్రికల్, ఫిట్టర్‌, మెషినిస్ట్‌.

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో టెన్త్‌, ఐటీఐ, డిప్లొమాలో ఉత్తీర్ణత ఉండాలి.

వయోపరిమితి: 1-12-2025 నాటికి 28 ఏళ్లు ఉండాలి. ఓబీసీకి 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీకి 5 ఏళ్లు, పీడబ్ల్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

జీతం: నెలకు ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ ట్రెయినీకి రూ.24,500 - రూ.90,000, టెక్నీషియన్‌ సీకి రూ.21,500 - రూ.82,000.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: రూ.590. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఈఎస్‌ఎం అభ్యర్థులకు ఫీజు లేదు.

ఎంపిక: రాత పరీక్ష (సీబీటీ) ఆధారంగా.  

దరఖాస్తు చివరి తేదీ: 2025 డిసెంబర్‌ 23.

Website:https://bel-india.in/job-notifications/