Published on Jan 4, 2025
Apprenticeship
బెల్‌లో అప్రెంటిస్‌ పోస్టులు
బెల్‌లో అప్రెంటిస్‌ పోస్టులు

చెన్నైలోని ప్రభుత్వ రంగ సంస్థ భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌) గ్రాడ్యుయేట్, డిప్లొమా, బీకామ్‌ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 83

వివరాలు:

1. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌: 63

2. టెక్నీషియన్‌ (డిప్లొమా) అప్రెంటిస్‌: 10

3. బీకాం అప్రెంటిస్‌: 10

విభాగాలు: ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌, కంప్యూటర్ సైన్స్‌, సివిల్, మెకానికల్.

అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ/బీటెక్‌, బీకాం ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 25 ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

స్టైపెండ్: నెలకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లకు రూ.17,500;  డిప్లొమా అప్రెంటిస్‌కు రూ.12,500; బీకామ్‌ అప్రెంటిస్‌లకు రూ.12,500. 

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ, సీజీపీఏ స్కోరు తదితరాల ఆధారంగా.

ఇంటర్వ్యూ తేదీలు: 20, 21, 22-01-2025.

వేదిక: భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్ (BEL), నుంగంబాక్కం, చెన్నై.

Website:https://bel-india.in/