Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Dec 24, 2025
Government Jobs
బెల్‌లోలో ట్రెయినీ ఇంజినీర్‌ పోస్టులు
బెల్‌లోలో ట్రెయినీ ఇంజినీర్‌ పోస్టులు

ప్రభుత్వ రక్షణ రంగ సంస్థ, నవరత్న హోదా కలిగిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్‌) నవీ ముంబయి యూనిట్‌ ఒప్పంద ప్రాతిపదికన ట్రెయినీ ఇంజినీర్, ప్రాజెక్ట్ ఇంజినీర్‌ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 06 

వివరాలు:

1. ట్రెయినీ ఇంజినీర్‌-1 (మెకానికల్): 04

2. ప్రాజెక్ట్ ఇంజినీర్‌-1: 02

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్‌ (మెకానికల్), బీఎస్సీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: 1-12-2025వ తేదీ నాటికి 28 - 32 ఏళ్లు ఉండాలి. ఓబీసీకి 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీకి 5 ఏళ్లు, పీడబ్ల్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

జీతం: నెలకు ట్రెయినీ ఇంజినీర్‌కు రూ.30,000 - రూ.40,000, ప్రాజెక్ట్ ఇంజినీర్‌కు రూ.40,000 - రూ.55,000.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: పోస్టులను అనుసరించి రూ.150 నుంచి 400+జీఎస్టీ. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఈఎస్‌ఎం అభ్యర్థులకు ఫీజు లేదు.

ఎంపిక: రాత పరీక్ష (సీబీటీ)/ ఇంటర్వ్యూ ఆధారంగా.  

దరఖాస్తు చివరి తేదీ: 2026 జనవరి 6. 

Website:https://bel-india.in/job-notifications/