ప్రపంచంలోనే అత్యధిక వేగంతో ప్రయాణించే కొత్త బుల్లెట్ రైలును చైనా 2024, డిసెంబరు 29న ఆవిష్కరించింది.
ఈ రైలు ప్రయోగ పరీక్షల్లో గంటకు 450 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది. దీన్ని సీఆర్450గా వ్యవహరిస్తున్నారు.
ఇది ప్రస్తుతం గంటకు 350 కి.మీ.వేగంతో పరుగులు తీసే సీఆర్400 మోడల్ కంటే అత్యంత వేగంగా ప్రయాణిస్తుంది.
దీంతో నాలుగు గంటలు పట్టే బీజింగ్ -షాంఘై ప్రయాణాన్ని కొత్త రైలులో కేవలం 2.5 గంటల్లోనే పూర్తిచేసుకోవచ్చు.