బెలారస్ అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో భారీ మెజారిటీతో నెగ్గారు.
ఆయన 86.8 శాతం ఓట్లతో వరుసగా ఏడోసారి దేశాధ్యక్షుడయ్యారు.
లుకషెంకోపై పోటీ చేసిన నలుగురు అభ్యర్థులు కూడా ఆయన మద్దతుదారులే.
1994 నుంచి జరిగిన ప్రతి అధ్యక్ష ఎన్నికలోనూ లుకషెంకో విజయం సాధిస్తూ వచ్చారు.