ఆసియాలో అత్యంత సంపన్నులైన 20 కుటుంబాల జాబితాను బ్లూమ్‌బర్గ్ ఇటీవల విడుదల చేసింది. ఇందులో 90.5 బిలియన్ డాలర్ల (రూ.7.86 లక్షల కోట్ల) సంపదతో ముకేశ్ అంబానీ కుటుంబం అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం 20 సంపన్న కుటుంబాల జాబితాలో 6 భారతీయ కుటుంబాలే ఉన్నాయి. మిస్త్రీ (షాపూర్జీపల్లోంజీ గ్రూపు), జిందాల్, బిర్లా, బజాజ్, హిందూజా కుటుంబాలూ ఈ జాబితాలో ఉన్నాయి.
అత్యంత సంపన్న 10 కుటుంబాలివే
ర్యాంకు | కుటుంబం | సంపద (బి.డాలర్లలో) | దేశం |
1 | ముకేశ్ అంబానీ | 90.5 | భారత్ |
2 | చీరావనోంట్ | 42.6 | థాయ్‌లాండ్ |
3 | హర్టోనో | 42.2 | ఇండోనేషియా |
4 | షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ | 37.5 | భారత్ |
5 | క్వాక్ | 35.6 | హాంకాంగ్ |
6 | త్సాయ్ | 30.9 | తైవాన్ |
7 | ఓపీ జిందాల్ | 28.1 | భారత్ |
8 | యోవిధ్య | 25.7 | థాయ్‌లాండ్ |
9 | కుమారమంగళంబిర్లా | 23 | భారత్ |
10 | లీ | 22.7 | దక్షిణ కొరియా |