Published on Oct 26, 2024
Current Affairs
బ్లూజే ఏరోస్పేస్‌
బ్లూజే ఏరోస్పేస్‌

నిట్ట నిలువుగా టేకాఫ్‌ తీసుకోవడంతో పాటు, భూమి మీదకు దిగే సామర్థ్యం (వీటీఓఎల్‌) ఉన్న మానవ రహిత సరకు రవాణా విమానాన్ని బ్లూజే ఏరోస్పేస్‌ ఆవిష్కరించింది.

దీని పనితీరును హైదరాబాద్‌ సమీపంలోని నాదర్‌గుల్‌ ఎయిర్‌ఫీల్డ్‌లో ప్రయోగాత్మకంగా పరీక్షించింది. 100 కిలోల బరువును 300 కిలోమీటర్ల దూరం మోసుకెళ్లే సామర్థ్యం దీనికి ఉందని సంస్థ పేర్కొంది.  

హైదరాబాద్‌ కేంద్రంగా 2022లో ప్రారంభించిన బ్లూజే ఏరోస్పేస్‌ ఇప్పటి వరకూ రూ.18 కోట్ల పెట్టుబడులను సమీకరించింది.