ఇరాక్ మాజీ అధ్యక్షుడు బర్హమ్ సలీహ్‌ను ఐక్యరాజ్యసమితి శరణార్థి సంస్థ తరువాతి అధిపతిగా ఎన్నికయ్యారు. దీన్ని సమితి జనరల్ అసెంబ్లీ 2025, డిసెంబరు 19న ఆమోదించింది. 1970ల తర్వాత పశ్చిమాసియాకు చెందిన వ్యక్తి మొదటిసారి ఈ పదవికి ఎంపికయ్యారు. 193 మంది సభ్యులున్న సర్వ ప్రతినిధి సభ కుర్దిష్ రాజకీయ నాయకుడైన బర్హమ్ సలీహ్‌ను ఐరాస శరణార్థుల హైకమిషనర్‌గా ఏకాభిప్రాయంతో ఎన్నుకుంది.