- దీర్ఘశ్రేణి సూపర్‌సోనిక్ క్రూజ్ క్షిపణి బ్రహ్మోస్‌ను భారత సైన్యం 2025, డిసెంబరు 1న విజయవంతంగా పరీక్షించింది. బంగాళాఖాతం వెంట ఒక ప్రయోగవేదిక నుంచి ఈ అస్త్రం దూసుకెళ్లింది. సైన్యంలోని దక్షిణ విభాగానికి చెందిన బ్రహ్మోస్ యూనిట్ దీన్ని చేపట్టింది.
- అండమాన్, నికోబార్‌లోని త్రివిధ దళాల విభాగం సమన్వయంతో ఇది సాగింది. తాజా పరీక్షలో ఈ క్షిపణి.. నిర్దేశిత లక్ష్యాన్ని అత్యంత కచ్చితత్వంతో ఛేదించింది. సైన్యంలోని బ్రహ్మోస్ విభాగాల పోరాట సన్నద్ధతను ఇది చాటిందని వివరించింది.