ఆక్స్‌ఫర్డ్ ప్రెస్ ఈ ఏడాది (2024) బ్రెయిన్ రాట్ మాటను ‘వర్డ్ ఆఫ్ ది ఇయర్’గా ఎంపిక చేసింది. ఆక్స్‌ఫర్డ్ ప్రెస్ నిర్వహించిన ఆన్‌లైన్ సర్వేలో 37 వేల మంది ‘బ్రెయిన్ రాట్’కు అనుకూలంగా ఓటేశారు.
అప్రధానమైన, అతి తేలికైన ఆన్‌లైన్ కంటెంట్‌ను (ఇన్‌స్టా రీల్స్, యూట్యూబ్ షాట్స్ లాంటివి) ఎక్కువగా చూడటం వల్ల మానసిక స్థితి క్షీణించడాన్ని బ్రెయన్ రాట్ అంటారని ఆక్స్‌ఫర్డ్ ప్రెస్ నిర్వచించింది.
వర్డ్ ఆఫ్ ద ఇయర్‌గా ఖాయం కావడానికి సోషల్ మీడియాలో తరచూ దొర్లే పదాలైన ‘డెమ్యూర్’ (రిజర్వ్‌గా ఉండడం), డైనమిక్ ప్రైసింగ్ (డిమాండ్ ఆధారంగా ధరల్లో మార్పు), లోర్ (నేపథ్య సమాచారం), రొమాంటసీ (రొమాన్స్+ ఫాంటసీ కలగలిపిన సాహిత్య ప్రక్రియ), స్లోప్ (తక్కువ నాణ్యత కలిగిన ఏఐ కంటెంట్) వంటి పదాలు ‘బ్రెయిన్ రాట్’తో పోటీపడ్డాయి.