Published on Jan 22, 2025
Current Affairs
బ్రాండ్‌ ఫైనాన్స్‌ జాబితా
బ్రాండ్‌ ఫైనాన్స్‌ జాబితా

ఐటీ సేవల విభాగంలో అత్యంత విలువైన 25 బ్రాండ్ల జాబితాలో దేశీయ ఐటీ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్, విప్రో, టెక్‌ మహీంద్రా, ఎల్‌టీఐ మైండ్‌ట్రీ, హెగ్జావేర్‌ టెక్‌లకు చోటు లభించింది.

బ్రాండ్‌ ఫైనాన్స్‌ ఈ జాబితాను రూపొందించింది. ఐటీ సేవల కంపెనీల బ్రాండ్ల మొత్తం విలువలో అమెరికా వాటా 40% కాగా,  36% వాటాతో మన దేశం రెండో స్థానంలో నిలిచింది.

భారత్‌కు చెందిన ఐటీ కంపెనీల బ్రాండ్ల విలువ మొత్తంగా 14% పెరగడం ఇందుకు దోహదం చేసింది.