లండన్‌లోని బ్రిటిష్ మ్యూజియంతో అస్సాం ప్రభుత్వం రుణ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తెలిపారు. శ్రీకృష్ణుడి జీవితాన్ని వర్ణించే 16వ శతాబ్దపు ‘బృందావనీ పట్టు వస్త్రం’ను 2027లో రాష్ట్రంలో ప్రదర్శించడానికి ఈ ఒప్పందంపై సంతకాలు చేసినట్లు ఆయన వివరించారు.