బ్రిటన్‌లో పర్యాటకులు ఎలక్ట్రానిక్ వీసా (ఇ-వీసా)లను కలిగి ఉండటాన్ని అక్కడి ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఈ నిబంధనను 2026, ఫిబ్రవరి 25 నుంచి అమల్లోకి తెచ్చింది. భారతీయులకు కూడా ఇది వర్తిస్తుంది. వీసా అవసరం లేనివారు ఎలక్ట్రానిక్ ప్రయాణ ధ్రువీకరణ (ఇ.టి.ఏ.) పొందాలి. అమెరికా, కెనడా, ఫ్రాన్స్‌లతో సహా 85 దేశాలకు చెందినవారు బ్రిటన్ సందర్శించాలంటే ఇంతకాలం వీసాలు అక్కర్లేదు. కొత్త నిబంధనల ప్రకారం వారు ఇ.టి.ఏ. పొందాలి. దీని కోసం 16 పౌండ్లు చెల్లించాలి. అది రెండేళ్లపాటు కానీ, ప్రయాణికుడి పాస్‌పోర్ట్ గడువు ముగిసిపోయేవరకు కానీ చెల్లుబాటులో ఉంటుంది.