బ్రిటన్, కెనడా దేశాల ప్రజలకు చైనా వీసా లేకుండా పర్యటించే అవకాశం కల్పించింది. దీంతో ఇలాంటి సదుపాయం ఉన్న దేశాల సంఖ్య 79కి పెరిగింది. తమ దేశంలో పర్యాటకాన్ని, వాణిజ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో చైనా ఈ సదుపాయం కల్పించింది. గడచిన రెండేళ్లుగా వీసా రహిత పర్యటనకు అర్హత కలిగిన దేశాల సంఖ్యను బాగా విస్తరించింది.
ఈ సదుపాయం ఉన్న దేశాల పౌరులు ఎలాంటి వీసా లేకుండా 30 రోజుల పాటు ఇక్కడ ఉండవచ్చు. చైనాలో నిర్దిష్ట కాలంలో పర్యాటక, వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించడంతోపాటు కుటుంబ సభ్యుల్ని, మిత్రుల్ని సందర్శించవచ్చు.