ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం సాధిస్తున్న ప్రగతి, ‘మన్ కీ బాత్’ వంటి రేడియో కార్యక్రమాల ద్వారా మోదీ ప్రజలకు చేరువ అవుతున్న తీరుపై రాసిన ‘మోదీలాగ్’ పుస్తకావిష్కరణ లండన్‌లోని నెహ్రూ కేంద్రంలో జరిగింది.
‘వికసిత భారతదేశం కోసం చర్చలు’ అనే ఉపశీర్షికతో ఉన్న ఈ పుస్తకాన్ని డాక్టర్ అశ్విన్ ఫెర్నాండెజ్ రాశారు. పుస్తకంలోని 33 అధ్యాయాల్లో వివిధ రంగాల్లో భారత్ సాధిస్తున్న ప్రగతిని వివరించారు.