ఉగ్రవాదం, మోసం, ముఠా హింసకు సంబంధించిన కేసుల్లో దర్యాప్తు కోసం కొత్తగా ఒక జాతీయ పోలీసు సర్వీసును ఏర్పాటు చేయనున్నట్లు బ్రిటన్ హోంమంత్రి షబానా మహమూద్ పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి నైపుణ్యం కలిగినవారితో ఈ విభాగం ఏర్పాటవుతుందని వివరించారు. ఇది అమెరికాకు చెందిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) తరహాలో ఉంటుంది. ఈ విభాగం అధికారుల వద్ద అధునాతన పరిజ్ఞానం అందుబాటులో ఉంటుంది.