ముంబయిలోని భారత అణు శక్తి విభాగానికి చెందిన బాబా అణు పరిశోధనా కేంద్రం (బార్క్) కింది సైంటిఫిక్ ఆఫీసర్, టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 21
వివరాలు:
సైంటిఫిక్ ఆఫీసర్-(ఈ/డి/సీ): 19
టెక్నికల్ ఆఫీసర్-డి: 02
విభాగాలు: కార్డియాలజీ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్, ఈఎన్‌టీ, రేడియోడయాగ్నసిసట్, రేడియాలజీ, ఆప్తల్మలజీ, జనరల్ డ్యూటీ, క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్, న్యూక్లియర్ మెడిసిన్, న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజీ, న్యూక్లియర్ మెడిసిన్.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్, ఎండీ, డీఎన్‌బీ, ఎంఎస్, పీజీ డిప్లొమా, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
జీతం: నెలకు సైంటిఫిక్ ఆఫీసర్-ఈకు రూ.78,800; సైంటిఫిక్ ఆఫీసర్-డి, టెక్నికల్ ఆఫీసర్-డికు రూ.67,700; సైంటిఫిక్ ఆఫీసర్-సికు రూ.56,100.
వయోపరిమితి: సైంటిఫిక్ ఆఫీసర్-ఈకు 50 ఏళ్లు; సైంటిఫిక్ ఆఫీసర్-డి,టెక్నికల్ ఆఫీసర్-డికు 40 ఏళ్లు; సైంటిఫిక్ ఆఫీసర్-సికు 35 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 27-02-2026.