ముంబయి ట్రాంబేలోని భారత అణు శక్తి విభాగానికి చెందిన భాభా అణు పరిశోధనా కేంద్రం (బార్క్) రేడియోలాజికల్ ఫిజిక్స్ అండ్ అడ్వైజరీ డివిజన్ రేడియాలజికల్ ఫిజిక్స్‌లో డిప్లొమా ప్రోగ్రామ్ ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
వివరాలు:
డిప్లొమా ఇన్ రేడియోలాజికల్ ఫిజిక్స్
వ్యవధి: ఏడాది
మొత్తం సీట్లు: 30.
అర్హత: కనీసం 60% మార్కులతో బీఎస్సీ, ఎంఎస్సీ లేదా ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ (ఫిజిక్స్) ఉత్తీర్ణులై ఉండాలి.
గరిష్ఠ వయో పరిమితి: 1 ఆగస్టు 2025 నాటికి 26 సంవత్సరాలు మించకూడదు.
స్టైపెండ్: నెలకు రూ.30,000.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ.500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
రాత పరీక్ష కేంద్రం: అనుశక్తినగర్, ముంబయి
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 13-05-2025.
రాత పరీక్ష తేదీ: 22.06.2025.
ఇంటర్వ్యూ తేదీలు: 23.06.2025 నుంచి 25.07.2025 వరకు.
కోర్సు ప్రారంభం: 2025, ఆగస్టు మొదటి వారం.