‘బ్రిక్స్’ కూటమి 16వ శిఖరాగ్ర సదస్సు 2024, అక్టోబరు 22న రష్యాలోని కజన్ నగరం వేదికగా ప్రారంభమైంది.
‘ప్రపంచాభివృద్ధి, భద్రత కోసం బహుళపక్షవాదాన్ని బలోపేతం చేయడం’ ఈ ఏడాది (2024) సదస్సు ప్రధాన నినాదం.
ఇందులో ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, ఇతర నేతలు పాల్గొన్నారు.
బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికాతో బ్రిక్స్ కూటమి ఏర్పాటైంది.