ముంబయిలోని బాబా అటామిక్ రిసెర్చ్ సెంటర్ (బార్క్) ఫిజికల్, కెమికల్, లైఫ్ సైన్సెస్ విభాగాల్లో జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఎంపికైన అభ్యర్థులు హోమీ బాబా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ (హెచ్‌బీఎన్‌ఐ) లో పీహెచ్‌డీ కోసం రిజిస్టర్ చేసుకోవచ్చు. ఎంపికైన వారు ముంబయితో పాటు కల్పాక్కం, ఇంధౌర్, కోల్‌కతా, హైదరాబాద్, విశాఖపట్నంలోని బార్క్ కేంద్రాలలో పని చేయాల్సి ఉంటుంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 105
వివరాలు:
జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (ఫిజికల్, కెమికల్, లైఫ్ సైన్సెస్)
అర్హత: బీఎస్సీలో కనీసం 60% మార్కులు, ఎంఎస్సీ/బీస్‌ఎంఎస్‌లో కనీసం 55% మార్కులు కలిగి ఉండాలి. యూజీసీ-సీఎస్‌ఐఆర్ నెట్, జేఈఎస్‌టీ, ఐసీఎంఆర్-జేఆర్‌ఎఫ్, ఐసీఏఆర్-జేఆర్‌ఎఫ్, డీబీటీ-జేఆర్‌బీ లేదా గేట్ వంటి జాతీయ స్థాయి పరీక్షలలో ఏదో ఒకటి ఉత్తీర్ణత సాధించి చెల్లుబాటు అయ్యే స్కోర్ కార్డ్ కలిగి ఉండాలి.
స్టైపెండ్: మొదటి రెండేళ్లు నెలకు రూ.37,000, మూడవ ఏడాది నుంచి రూ.42,000
వయోపరిమితి: 01.08.2026 నాటికి 28 ఏళ్ల లోపు ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు: రూ.500, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు లేదు.
దరఖాస్తు చివరి తేదీ: 31.03.2026.
ఇంటర్వ్యూ తేదీ: జూన్-జులై 2026.