‘బయో ఆసియా 2026’.. 23వ అంతర్జాతీయ సదస్సును హైదరాబాద్‌లోని మాదాపూర్ హైటెక్స్‌లో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి 2026, ఫిబ్రవరి 17న ప్రారంభించారు. టెక్ బయో అన్‌లీష్డ్: ఏఐ ఆటోమేషన్-బయాలజీ రివల్యూషన్ థీమ్‌తో దీన్ని నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 500 ప్రముఖ సంస్థలకు చెందిన 4,000 మందికి పైగా ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు.
క్యాన్సర్ చికిత్సలో విశేషంగా కృషిచేసిన పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డాక్టర్ బ్రూస్ ఎల్ లెవిన్‌కు ప్రతిష్ఠాత్మక జీనోమ్ వ్యాలీ ఎక్స్‌లెన్స్ అవార్డును ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అందజేశారు.