Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Jan 5, 2026
Current Affairs
బియ్యం ఉత్పత్తిలో భారత్‌దే అగ్రస్థానం
బియ్యం ఉత్పత్తిలో భారత్‌దే అగ్రస్థానం

బియ్యం ఉత్పత్తిలో చైనాను వెనక్కినెట్టి భారత్‌ ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచిందని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ 2026, జనవరి 4న వెల్లడించారు. 25 రకాల పంటలకు సంబంధించి 184 రకాల వంగడాలను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ కొత్త వంగడాలతో  రైతులకు అధిక ఆదాయం సమకూరుతుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. మొత్తం 150.18 మిలియన్‌ టన్నుల బియ్యం ఉత్పత్తితో ప్రపంచంలోనే ప్రథమస్థానంలో నిలిచిందన్నారు.