భారత ఆర్థిక వ్యవస్థపై అమెరికన్ మేనేజ్‌మెంట్ కన్సల్టింగ్ సంస్థ బెయిన్ అండ్ కంపెనీ - నాస్‌కామ్ (నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీసెస్) ఒక నివేదికను విడుదల చేసింది.
దీని ప్రకారం, స్వాతంత్య్రం పొందిన 100 సంవత్సరాల (2047) కల్లా అభివృద్ధి చెందిన (వికసిత్ భారత్) దేశంగా అవతరించాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యంగా ఉంది.
సరిగ్గా అదే సమయానికి ‘భారత్ అధికాదాయ దేశంగా అవతరించనుంది. 23-35 లక్షల కోట్ల డాలర్ల (దాదాపు రూ.2000-3000 లక్షల కోట్ల) స్థాయిలో భారత జీడీపీ నమోదవ్వొచ్చని నివేదిక అంచనా వేసింది.