Published on Sep 30, 2024
Current Affairs
బెయిన్‌ అండ్‌ కంపెనీ నివేదిక
బెయిన్‌ అండ్‌ కంపెనీ నివేదిక

♦ కృత్రిమ మేధ(ఏఐ) సంబంధిత ఉత్పత్తులు, సేవల అంతర్జాతీయ మార్కెట్‌ ఏటా 40-55 శాతం వృద్ధి రేటుతో 2027 కల్లా 990 బి. డాలర్ల (దాదాపు రూ.83 లక్షల కోట్లు) స్థాయికి చేరగలదని బెయిన్‌ అండ్‌ కంపెనీ ఇటీవల విడుదల చేసిన అయిదో వార్షిక ‘గ్లోబల్‌ టెక్నాలజీ రిపోర్ట్‌’ తెలిపింది. అలాగే ఏఐ పనిభారం 2027 నాటికి ఏటా 25-35% మేర పెరగగలదనీ వెల్లడించింది.

నివేదికలోని ముఖ్యాంశాలు.

♦ ఏఐ రాకతో ప్రస్తుతం 50-200 మెగావాట్ల డేటా సెంటర్లు కాస్తా 1 గిగావాట్‌ సామర్థ్యాన్ని మించి చేరొచ్చు. ప్రస్తుతం ఒక డేటా సెంటర్‌ ఏర్పాటుకు 1-4 బి. డాలర్ల వ్యయం అవుతుంటే, అయిదేళ్లలో 10-25 బి. డాలర్లతో పెద్ద డేటా సెంటర్లు ఏర్పాటు కావచ్చు.

♦ డేటా సెంటర్లు అధికం కావడంతో ఏఐ ఆధారిత గ్రాఫిక్స్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల (జీపీయూలు)కు గిరాకీ పెరగవచ్చు. విడిభాగాలకు 2026 కల్లా 30% మేర వృద్ధి కనిపించొచ్చు. ఇది కాస్తా సెమీకండక్టర్ల కొరతకు దారితీయొచ్చు.