బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ ఎస్‌యు-5 విభాగంలో భారత్ రెండు పతకాలు సాధించింది. తులసిమతి మురుగేశన్ రజతం గెలవగా, మనీషా రామ్‌దాస్ కాంస్యం సాధించింది. వీళ్లిద్దరూ తమిళనాడుకు చెందిన క్రీడాకారిణులే.
* ఫైనల్లో తులసిమతి చైనా అమ్మాయి యాంగ్ కియుగ్జియా చేతిలో ఓడి రజతానికి పరిమితమైంది.
* మనీషా కేథరిన్ (డెన్మార్క్)ను ఓడించి కాంస్య పతకాన్ని చేజిక్కించుకుంది.