Published on Mar 5, 2025
Admissions
బయోటెక్నాలజీ ఎలిజిబిలిటీ టెస్ట్‌ 2025
బయోటెక్నాలజీ ఎలిజిబిలిటీ టెస్ట్‌ 2025

నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సి (ఎన్‌టీఏ) 2025 విద్యాసంవత్సరానికి సంబంధించి బయోటెక్నాలజీ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (బీఈటీ) 2025 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ పరీక్ష ఆధారంగా దేశంలోని ప్రముఖ యూనివర్సిటీల్లో బయోటెక్నాలజీ డీబీటీ - జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలోషిప్‌ ప్రవేశాలు పొందవచ్చు.

వివరాలు:

బయోటెక్నాలజీ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (బీఈటీ) 2025

అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.

పరీక్ష విధానం: కంప్యూటర్ ఆధారిత విధానంలో మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు అడుగుతారు.

పరీక్ష వ్యవధి: 180 (3 గంటలు) నిమిషాల సమయం.

దరఖాస్తు రుసుము: రూ.1300; ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు రూ.650.

ఆన్‌లైన్‌ దరఖాస్తు, పరీక్ష రుసుము చెల్లింపు చివరి తేదీ: 28-03-2025.

దరఖాస్తు సవరణ తేదీలు: 30-03-2025 నుంచి 31-03-2025 వరకు.

పరీక్ష తేదీ: 13-05-2025.

Website: https://exams.nta.ac.in/DBT/

Apply online: https://dbt2025.ntaonline.in/