- 2016 నాటి పాత నిబంధనల స్థానంలో, రూపొందించిన ‘బ్యాగేజీ నిబంధనలు 2026’ 2026, ఫిబ్రవరి 2 నుంచి అమల్లోకి వచ్చినట్లు కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు (సీబీఐసీ) తెలిపింది. దీని ప్రకారం, విదేశాల నుంచి విమానం లేదా సముద్ర మార్గాల్లో మనదేశానికి వచ్చే మహిళా ప్రయాణికులు 40 గ్రాముల వరకు, పురుషులు 20 గ్రాముల వరకు బంగారు ఆభరణాలను సుంకం లేకుండా తీసుకురావచ్చు.
- అయితే వీరు ఏడాదికి పైగా విదేశాల్లో నివసిస్తూ, తిరిగి వస్తున్న వారు లేదా భారత సంతతి పర్యాటకులైనా కావచ్చు. ఈ ఆభరణాలు కచ్చితంగా వ్యక్తిగత వినియోగం కోసమే తీసుకురావాలి. బిస్కెట్లు, కడ్డీల రూపంలో ఉండే పసిడికి ఈ మినహాయింపు లభించదు. ఇప్పటివరకు మహిళలు రూ.లక్ష, పురుషులు రూ.50 వేల విలువైన ఆభరణాలే ఇలా తెచ్చుకోవచ్చు.