Published on Oct 16, 2024
Apprenticeship
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో అప్రెంటిస్ ఖాళీలు
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో అప్రెంటిస్ ఖాళీలు

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకు శాఖల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 

మొత్తం ఖాళీలు: 600 (ఎస్సీ- 65; ఎస్టీ- 48; ఓబీసీ- 131; ఈడబ్ల్యూఎస్‌- 51; యూఆర్‌- 305)

వివరాలు:

ఆంధ్రప్రదేశ్‌లోని బ్యాంకు శాఖల్లో 11, తెలంగాణలోని బ్యాంకు శాఖల్లో 16 ఖాళీలు ఉన్నాయి.

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ సంస్థ నుంచి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 

శిక్షణ వ్యవధి: ఏడాది.

వయోపరిమితి: 30-06-2024 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు 10-15 ఏళ్ల సడలింపు ఉంటుంది.

స్టైపెండ్: నెలకు రూ.9000.

ఎంపిక ప్రక్రియ: 12వ తరగతి (హెచ్‌ఎస్‌సీ/ 10+2)/ డిప్లొమా మార్కులు, సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు రుసుము: యూఆర్‌/ ఈడబ్ల్యూఎస్‌/ ఓబీసీలకు రూ.150 + జీఎస్‌టీ, ఎస్సీ/ ఎస్టీలకు రూ.100 + జీఎస్‌టీ, దివ్యాంగులకు మినహాయింపు ఉంటుంది.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 24-10-2024.

Website:https://bankofmaharashtra.in/

Apply online:https://ibpsonline.ibps.in/bomcooct23/