Published on Nov 4, 2024
Government Jobs
బ్యాంక్ ఆఫ్ బరోడాలో వివిధ పోస్టులు
బ్యాంక్ ఆఫ్ బరోడాలో వివిధ పోస్టులు

గుజరాత్‌ రాష్ట్రం వడోదరలోని బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రధాన కార్యాలయం కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన దేశవ్యాప్తంగా బీవోబీ శాఖల్లోని వివిధ విభాగాల్లో కింది ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 592 (యూఆర్‌- 352; ఎస్సీ- 56; ఎస్టీ- 24; ఓబీసీ- 123; ఈడబ్ల్యూఎస్‌- 37)

వివరాలు:

పోస్టులు: రిలేషన్‌షిప్ మేనేజర్, జోనల్ లీడ్ మేనేజర్, బిజినెస్ మేనేజర్, డేటా ఇంజినీర్స్, టెస్టింగ్ స్పెషలిస్ట్, ప్రాజెక్ట్ మేనేజర్, జోనల్ రిసీవబుల్స్ మేనేజర్, రీజనల్ రిసీవబుల్స్ మేనేజర్, ఏరియా రిసీవబుల్స్ మేనేజర్, ఫ్లోర్ మేనేజర్, సీనియర్ క్లౌడ్ ఇంజినీర్, ప్రొడక్ట్ మేనేజర్ తదితరాలు.

విభాగం: ఫైనాన్స్, ఎంఎస్‌ఎంఈ, డిజిటల్ గ్రూప్, రిసీవబుల్స్ డిపార్ట్‌మెంట్, ఐటీ, సీ అండ్‌ ఐసీ.

అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, సీఏ/ సీఎంఏ/ సీఎఫ్‌ఏ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 

అప్లికేషన్ ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ అభ్యర్థులకు రూ.600. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రూ.100.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 19.11.2024.

Website:https://www.bankofbaroda.in/