Published on Sep 20, 2025
Government Jobs
బ్యాంక్ ఆఫ్ బరోడాలో మేనేజర్‌ పోస్టులు
బ్యాంక్ ఆఫ్ బరోడాలో మేనేజర్‌ పోస్టులు

బ్యాంక్ ఆఫ్‌ బరోడా రెగ్యులర్‌ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 58

వివరాలు:

1. చీఫ్‌ మేనేజర్‌(ఇన్వెస్టర్‌ రిలేషన్స్‌): 02

2. మేనేజర్‌ - (ట్రేడ్‌ ఫైనాన్స్‌ ఆపరేషన్స్‌): 14

3. మేనేజర్‌ ఫారెక్స్‌ అక్విజిషన్‌ & రిలేషన్‌షిప్‌: 37

4. సీనియర్‌ మేనేజర్‌ ఫారెస్ట్‌ అక్విజిషన్‌ & రిలేషన్‌షిప్‌: 05

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 24 ఏళ్ల నుంచి 40 ఏళ్లు ఉండాలి.

వేతనం: నెలకు ఎంఎంజీ/ఎంస్‌ - 2కు రూ.64,820 - రూ.93,960, ఎంఎంజీ/ఎస్‌-3కు రూ.85,920 - రూ.1,05,280, ఎస్‌ఎంజీ/ఎస్‌-4కు రూ.1,02,300 -  రూ.1,20,940.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.850, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఈఎస్‌ఎం/డీఈఎస్‌ఎం, మహిళా అభ్యర్థులకు రూ.175.

ఎంపిక విధానం: రాత పరీక్ష, సైకోమెట్రిక్‌ టెస్ట్‌ ఆధారంగా.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2025 అక్టోబర్‌ 9.

Website:https://bankofbaroda.bank.in/career/current-opportunities/recruitment-for-the-various-positions-on-regular-basis-in-corporate-accounts-19-09