Published on Mar 27, 2025
Government Jobs
బ్యాంక్ ఆఫ్ బరోడాలో పోస్టులు
బ్యాంక్ ఆఫ్ బరోడాలో పోస్టులు

బ్యాంక్ ఆఫ్‌ బరోడా ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 146

వివరాలు:

1. డిప్యూటీ డిఫెన్స్‌ బ్యాంకింగ్ అడ్వైజర్‌(డీడీబీఏ): 01

2. ప్రైవేట్ బ్యాంకర్‌- రేడియన్స్‌ ప్రైవేట్: 03

3. గ్రూప్‌ హెడ్‌: 04

4. టెరిటోరి హెడ్‌: 17

5. సీనియర్ రిలేషన్‌షిప్‌ మేనేజర్‌: 101

6. వెల్త్‌ స్ట్రాటజిస్ట్‌(ఇన్వెస్ట్‌మెంట్ అండ్‌ ఇన్సూరెన్స్‌): 18

7. ప్రొడక్ట్‌ హెడ్- ప్రైవేట్ బ్యాంకింగ్‌: 01

8. పోర్ట్‌పోలియో రీసెర్చ్‌ అనలిస్ట్‌: 01

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: డిప్యూటీ డిఫెన్స్‌ బ్యాంకింగ్‌ అడ్వైజర్‌ పోస్టుకు 57 ఏళ్లు, ప్రైవేట్ బ్యాంకర్‌కు 33 - 50 ఏళ్లు, గ్రూప్‌ హెడ్‌కు 31-45 ఏళ్లు, టెరిటోరి హెడ్‌కు 27-40 ఏళ్లు, సీనియర్‌ రిలేషన్‌షిప్‌ మేనేజర్‌, వెల్త్‌ స్ట్రాటజిస్ట్‌(ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ఇన్సూరెన్స్‌), ప్రొడక్ట్‌ హెడ్‌కు 24 - 45 ఏళ్లు, పోర్ట్‌పోలియో రీసెర్చ్‌ అనలిస్ట్‌కు 22 - 35 ఏళ్లు.

జీతం: సంవత్సరానికి డిప్యూటీ డిఫెన్స్‌ బ్యాంకింగ్ అడ్వైజర్‌కు రూ.18,00,000, ప్రైవేట్ బ్యాంకర్‌కు రూ. 14,00,000 - రూ. 25,00,000, గ్రూప్‌ హెడ్‌కు రూ.16,00,000 - రూ.28,00,000, టెరిటోరి హెడ్‌కు రూ.14,00,000 - రూ. 25,00,000, సీనియర్ రిలేషన్‌షిప్‌ మేనేజర్‌కు రూ.8,00,000 - రూ.14,00,000, వెల్త్‌ స్ట్రాటజిస్ట్‌కు రూ.12,00,000 - రూ.20,00,000, ప్రొడక్ట్‌ హెడ్‌కు రూ.10,00,000 - రూ.16,00,000, పోర్ట్ పోలియో అనలిస్ట్‌కు రూ.6,00,000.  

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.600, ఎస్సీ, ఎస్టీ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.100.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 15-04-2025.

Website:https://www.bankofbaroda.in/career/current-opportunities/recruitment-of-professionals-on-contractual-basis-for-various-department