Published on Feb 20, 2025
Government Jobs
బ్యాంక్ ఆఫ్ బరోడాలో ప్రొఫెషనల్ పోస్టులు
బ్యాంక్ ఆఫ్ బరోడాలో ప్రొఫెషనల్ పోస్టులు

బ్యాంక్ ఆఫ్‌ బరోడా (బీఓబీ) రెగ్యులర్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో  ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 518

వివరాలు: 

సీనియర్‌ మేనేజర్‌, మేనేజర్‌-డెవలపర్‌ ఫుల్‌స్టాక్‌, ఆఫీస్‌-డెవలపర్‌, సీనియర్‌ మేనేజర్‌, ఆఫీసర్‌-క్లౌడ్ ఇంజినీర్‌, ఆఫీసర్‌-ఏఐ ఇంజినీర్‌, మేనేజర్‌-ఏఐ ఇంజినీర్‌, సీనియర్‌ మేనేజర్‌ ఏఐ ఇంజినీర్‌, ఆఫీసర్‌ ఏపీఐ డెవలపర్‌, మనేజర్‌ ఏపీఐ డెవలపర్‌, మేనేజర్‌- నెట్‌వర్క్‌ అడ్మినిస్ట్రేటర్‌, సీనియర్‌ మేనేజర్‌ డేటాబేస్‌ అడ్మినిస్ట్రేటర్‌.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ, బీటెక్‌, ఎంఈ, ఎంటెక్‌, ఎంసీఏ, సీఏ, సీఎఫ్‌ఏ, ఎంబీఏలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.  

వయోపరిమితి: పోస్ట్‌ గ్రేడ్-ఎంఎంజీ/ఎస్‌-3 కి 27 నుంచి 37 ఏళ్లు, ఎంఎంజీ/ఎస్‌-2 కు 24 నుంచి 34 ఏళ్లు, జేఎంజీ/ఎస్‌-1కు 22 నుంచి 32 ఏళ్లు, ఎస్‌ఎంజీ/ఎస్‌-4కు 33 నుంచి 43 ఏళ్లు ఉండాలి.

జీతం: నెలకు పోస్ట్‌ గ్రేడ్- జేఎంజీ/ఎస్‌-1కు రూ.48,480, ఎంఎంజీ/ఎస్‌-2కు రూ.64,820, ఎంఎంజీ/ఎస్‌-3కు రూ.85,920, ఎస్‌ఎంజీ/ఎస్‌-4కు రూ.1,02,300.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.600, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ. 100.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా. 

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 11-03-2025.

Website:https://www.bankofbaroda.in/career/current-opportunities/recruitment-of-professionals-on-regular-basis-for-various-departments-11-03