Published on Dec 18, 2025
Government Jobs
బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్రెడిట్ ఆఫీసర్ పోస్టులు
బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్రెడిట్ ఆఫీసర్ పోస్టులు

ముంబయి ప్రధాన కేంద్రంగా గల బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ) దేశవ్యాప్తంగా ఉన్న బీవోఐ శాఖల్లో రెగ్యులర్‌ ప్రాతిపదికన జనరల్‌ బ్యాంకింగ్‌ ఆఫీసర్‌ స్ట్రీములో క్రెడిట్‌ ఆఫీసర్‌ (ఎంఎంజీఎస్‌-III, ఎంఎంజీఎస్‌-II, ఎస్‌ఎంజీఎస్‌-IV) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 514.

వివరాలు:

1. క్రెడిట్ ఆఫీసర్(ఎస్‌ఎంజీఎస్‌-IV): 36 పోస్టులు

2. క్రెడిట్ ఆఫీసర్ (ఎంఎంజీఎస్‌-III): 60 పోస్టులు

3. క్రెడిట్ ఆఫీసర్ (ఎంఎంజీఎస్‌-II): 418 పోస్టులు

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేట్‌, ఎంబీఏ, పీజీడీబీఎం, పీజీ, సీఏ, సీఎంఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

పే స్కేల్: నెలకు ఎంఎంజీఎస్‌-II పోస్టులకు రూ.64,820- రూ.93,960; ఎస్‌ఎంజీఎస్‌-IV పోస్టులకు రూ.1,02,300- రూ.1,20,940; ఎంఎంజీఎస్‌-III పోస్టులకు రూ.85,920- రూ.1,05,280.

ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు రుసుము: రూ.850(ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.175).

పరీక్ష విధానం: కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలో ఇంగ్లిస్‌ లాంగ్వేజ్‌ 25 ప్రశ్నలు 25 మార్కులు; రీజనింగ్‌ 25 ప్రశ్నలు 25 మార్కులు; క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ 25 ప్రశ్నలు 25 మార్కులు; ప్రొఫెషనల్ నాలెడ్జ్ (క్రెడిట్/బ్యాంకింగ్ సంబంధిత) 75 ప్రశ్నలు 75 మార్కులకు మొత్తం 150 మార్కులకు పరీక్ష ఉంటుంది. వ్యవధి 120 నిమిషాలు, నెగటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం.

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 20.12.2025.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 05.01.2026.

Website:https://bankofindia.bank.in/career/recruitment-notice