Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Dec 25, 2025
Apprenticeship
బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో అప్రెంటిస్‌ పోస్టులు
బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో అప్రెంటిస్‌ పోస్టులు

ముంబయిలోని బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (బీఓఐ) వివిధ జోన్‌లలో అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

వివరాలు:

మొత్తం అప్రెంటిస్‌ ఖాళీల సంఖ్య: 400

అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీలో ఉత్తీర్ణత ఉండాలి.

వయోపరిమితి: 01.12.2025 తేదీ నాటికి 20 - 28 ఏళ్లు ఉండాలి. ఎస్సీ, ఎస్టీకి 5 ఏళ్లు, ఓబీసీకి 3 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

స్టైపెండ్‌: నెలకు రూ.13,000.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.800, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.600, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.400. 

ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా.

దరఖాస్తు ప్రారంభ తేదీ: 2025 డిసెంబర్ 25.

ఆన్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2026 జనవరి 10.

Website:https://bankofindia.bank.in/career/recruitment-notice