గత ఆర్థిక సంవత్సరంలో (2024-25) 12 ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ (పీఎస్‌బీ) కలిపి రికార్డు స్థాయిలో రూ.1,78,364 కోట్ల లాభాన్ని ఆర్జించాయి.
అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో (2023-24) నమోదైన రూ.1.41 లక్షల కోట్లతో పోలిస్తే లాభం 26 శాతం పెరిగింది.
విలువ ప్రకారం చెప్పాలంటే రూ.37,100 కోట్లు అధికంగా లాభాన్ని ఆర్జించాయి.
రూ.1.78 లక్షల కోట్ల లాభంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)దే 40 శాతం.
ఈ ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకు రూ.70,901 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. 2023-24లో వచ్చిన రూ.61,077 కోట్లతో పోలిస్తే ఇది 16 శాతం ఎక్కువ.
2024-25లో 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల లాభాలూ పెరిగాయి.