Published on Mar 7, 2025
Current Affairs
బ్యాంకర్ల సమితి నివేదిక
బ్యాంకర్ల సమితి నివేదిక

తెలంగాణలో 2023 డిసెంబరు 31 నాటి గణాంకాలతో పోలిస్తే.. 2024 డిసెంబరు 31 నాటికి అన్ని ఖాతాల్లో కలిపి బ్యాంకు డిపాజిట్లు ఏకంగా రూ.60 వేల కోట్లు పెరిగి ఆ మొత్తం రూ.8.16 లక్షల కోట్లు దాటినట్లు బ్యాంకర్ల సమితి తాజా నివేదిక పేర్కొంది.

ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజన కింద రాష్ట్రంలో 1.22 కోట్లకు పైగా బ్యాంకు ఖాతాలున్నాయి. వాటిలో 71.48 లక్షలు మహిళలవి.. మిగిలినవి పురుషులవి. 20.74 లక్షల జన్‌ధన్‌ ఖాతాల్లో పైసా కూడా డిపాజిట్‌ లేదు. మిగిలిన 1.02 కోట్ల ఖాతాల్లో రూ.4,768 కోట్లు డిపాజిట్లుగా ఉన్నాయి.