Published on Mar 27, 2025
Current Affairs
బ్యాంకింగ్‌ చట్టాల సవరణ బిల్లు, 2024
బ్యాంకింగ్‌ చట్టాల సవరణ బిల్లు, 2024

బ్యాంకింగ్‌ చట్టాల సవరణ బిల్లు, 2024ను పార్లమెంట్‌ 2025, మార్చి 26న ఆమోదించింది. ఈ బిల్లును 2024, డిసెంబరులో లోక్‌ సభ ఆమోదించగా, రాజ్యసభ తాజాగా ఆమోదం తెలిపింది. 

బిల్లులోని అంశాలు:

బ్యాంకు ఖాతాదారులు ఒక్కో ఖాతాకు నలుగురు వరకు నామినీలను నియమించుకునేందుకు అవకాశం ఉటుంది

నగదు డిపాజిట్లు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల సమయంలోనే నామినేషన్‌ వివరాలను తెలియజేయాల్సి ఉంటుంది.

లాకర్ల విషయంలోనూ ఇదే నిబంధన వర్తిస్తుంది. ఇప్పటికే బీమా పాలసీలు, ఇతర ఆర్థిక సాధనాల్లో ఈ విధానం అమల్లో ఉంది.