Published on Dec 13, 2025
Current Affairs
బీమా రంగంలో 100% ఎఫ్‌డీఐ
బీమా రంగంలో 100% ఎఫ్‌డీఐ

బీమా రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) పరిమితిని ప్రస్తుత 74% నుంచి 100 శాతానికి పెంచే బిల్లుకు 2025, డిసెంబరు 12న కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. డిసెంబరు 19న ముగియనున్న పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లోనే బీమా సవరణ బిల్లు-2025ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇన్సూరెన్స్‌ చట్టం-1938లో సవరణలు చేసి, జీవిత, సాధారణ బీమా రెండింటినీ ఒకే సంస్థ అందించే విధంగా కాంపోజిట్‌ లైసెన్స్‌ విధానాన్ని తీసుకురావాలని కొత్త బిల్లు నిర్ణయించింది.