బే ఆఫ్ బెంగాల్ ఇనీషియేటివ్ ఫర్ మల్టీ-సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోపరేషన్ (బిమ్‌స్టెక్) ఏర్పాటుకు గుర్తుగా ఏటా జూన్ 6న ‘బిమ్‌స్టెక్ డే’గా నిర్వహిస్తారు. బంగాళాఖాతం ఒడ్డున లేదా ఆనుకుని ఉన్న దేశాలన్నీ ఇందులో భాగస్వాములుగా ఉంటాయి. ఇందులో మొత్తం ఏడు సభ్య దేశాలు ఉన్నాయి. వాణిజ్యం, పెట్టుబడి, సాంకేతికత, రవాణా, పర్యాటకం, మత్స్య సంపద లాంటి రంగాల్లో వాటి మధ్య సహకారాన్ని పెంపొందించుకోవడం, బలోపేతం చేసుకోవడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
చారిత్రక నేపథ్యం
1997, జూన్ 6న బంగ్లాదేశ్, భారత్, శ్రీలంక, థాయ్‌లాండ్ బ్యాంకాక్ డిక్లరేషన్‌పై సంతకాలు చేసి, బిస్ట్ - ఎకనామిక్ కోపరేషన్ (బిస్ట్-ఈసీ)ను నెలకొల్పాయి. 1977, డిసెంబరు 22న మయన్మార్; 2004, ఫిబ్రవరిలో నేపాల్, భూటాన్ దేశాలు ఇందులో చేరాయి. 2004, జులై 31న బ్యాంకాక్‌లో జరిగిన మొదటి శిఖరాగ్ర సమావేశంలో దీని పేరును ‘బిమ్‌స్టెక్’గా మార్చారు. అదే సదస్సులో ఏటా జూన్ 6న ‘బిమ్‌స్టెక్ డే’గా నిర్వహించాలని సభ్యదేశాలు తీర్మానించాయి.