Published on Sep 24, 2024
Government Jobs
బామర్‌ లారీ లిమిటెడ్‌లో ఆఫీసర్ ఖాళీలు
బామర్‌ లారీ లిమిటెడ్‌లో ఆఫీసర్ ఖాళీలు

కోల్‌కతాలోని ప్రభుత్వ రంగ సంస్థ- బామర్ లారీ అండ్ కంపెనీ లిమిటెడ్ ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టులు: 07

వివ‌రాలు:

1. మేనేజర్: 01

2. డిప్యూటీ మేనేజర్: 01

3. అసిస్టెంట్ మేనేజర్: 01

4. ఆఫీసర్/జూనియర్ ఆఫీసర్: 04

విభాగాలు: ఛానల్ సేల్స్‌, వెకేషన్స్‌, కార్పొరేట్ బిజినెస్, ట్రావెల్.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, ఎంటీఎం/ ఎంబీఏ/ గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: మేనేజర్ పోస్టుకు 38 ఏళ్లు; డిప్యూటీ మేనేజర్ పోస్టుకు 35 ఏళ్లు; అసిస్టెంట్ మేనేజర్ పోస్టుకు 32 ఏళ్లు; ఆఫీసర్/జూనియర్ ఆఫీసర్ పోస్టులకు 30 ఏళ్లు మించకూడదు.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, గ్రూప్‌ డిస్కషన్, మెడికల్ టెస్ట్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

పని ప్రదేశాలు: హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబయి, దిల్లీ.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 04-10-2024.

Website:https://www.balmerlawrie.com/