Published on Nov 27, 2024
Government Jobs
బామర్‌ లారీస్‌లో జూనియర్‌ ఆఫిసర్ పోస్టులు
బామర్‌ లారీస్‌లో జూనియర్‌ ఆఫిసర్ పోస్టులు

భారత ప్రభుత్వరంగ సంస్థకు చెందిన పెట్రోలియం అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ మంత్రిత్వ శాఖ పరిధిలోని కోల్‌కతాలోని బామర్‌ లారీస్‌ అండ్‌ కో లిమిటెడ్‌ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 08

వివరాలు:

అసిస్టెంట్‌ మేనేజర్‌ (ఐటీ సైబర్‌ సెక్యూరిటీ)- 01

జూనియర్‌ ఆఫీసర్‌ (అకౌంట్స్‌ అండ్‌ ఫైనాన్స్‌)- 04

జూనియర్‌ ఆఫీసర్‌ (ఆపరేషన్స్‌)- 01 

జూనియర్‌ ఆఫీసర్‌ (వేర్‌హౌస్‌ ఆపరేషన్స్‌)- 01

జూనియర్‌ ఆఫీసర్‌ (హెచ్‌ఆర్‌ అండ్‌ అడ్మినిస్ట్రేషన్‌)- 01

అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

జీతం: నెలకు అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టుకు రూ.70,541; జూనియర్‌ ఆఫీసర్‌ (వేర్‌హౌస్‌ ఆపరేషన్స్‌) పోస్టుకు రూ.33,095; ఇతర పోస్టులకు రూ.36,785.

వయోపరిమితి: అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టుకు 32 ఏళ్లు; ఇతర పోస్టులకు 30 ఏళ్లు మించకూడదు.

జాబ్‌ లొకేషన్‌: చెన్నై, కోల్‌కతా, రాయ్‌, ముంబయి.

ఎంపిక విధానం: అభ్యర్థుల షార్ట్‌లిస్టింగ్‌, రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా. 

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 06-12-2024.

Website:https://www.balmerlawrie.com/