Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Dec 12, 2025
Government Jobs
బామర్‌ లారీలో మెనేజిరియల్‌ పోస్టులు
బామర్‌ లారీలో మెనేజిరియల్‌ పోస్టులు

భారత ప్రభుత్వరంగ సంస్థకు చెందిన పెట్రోలియం అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ మంత్రిత్వ శాఖ పరిధిలోని కోల్‌కతాలోని బామర్‌ లారీ అండ్‌ కో లిమిటెడ్‌ మేనేజియరిల్‌ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 18

వివరాలు: 

1. డిప్యూటీ మేనేజర్‌ (ట్రావెల్‌)- 03

2. అసిస్టెంట్‌ మేనేజర్‌: 10

3. జూనియర్‌ ఆఫీసర్‌/ఆఫీసర్‌: 04

4. సీనయర్‌ మేనేజర్‌: 01

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో ఎంటీఎం/ ఎంబీఏ/ ఇంజినీరింగ్‌ డిగ్రీ/బ్యాచిలర్‌ డిగ్రీ, ఎంసీఏ/బీఈ/బీటెక్‌ లేదా తత్సమాన విద్యార్హతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

వయోపరిమితి: సీనియర్‌ మేనేజర్‌కు 40 ఏళ్లు, అసిస్టెంట్‌ మేనేజర్‌కు 32 ఏళ్లు, డిప్యూటీ మేనేజర్‌కు 35ఏళ్లు; జూనియర్‌ ఆఫీసర్‌కు 30 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, రాతపరీక్ష/ఇంటర్వ్యూ, గ్రూప్‌డిస్కషన్‌ తదితరాల ఆధారంగా. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 04-01-2026.

Website:https://www.balmerlawrie.com/