తెలంగాణ హైకోర్టునుంచి బదిలీ అయిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే 2025, జనవరి 21న బాంబే హైకోర్టు సీజేగా ప్రమాణం చేశారు.
ముంబయిలోని రాజ్‌భవన్ దర్బార్ హాలులో నిర్వహించిన కార్యక్రమంలో మహారాష్ట్ర గవర్నర్ సి.పి.రాధాకృష్ణన్ ఆయనతో ప్రమాణం చేయించారు.
జస్టిస్ అరాధే 2023 జులై 19న తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జులై 23న పదవీ ప్రమాణంచేసి బాధ్యతలు చేపట్టారు.